రూ.37 కోట్ల విలువైన 234 కిలోల బంగారం స్వాధీనం
చెన్నై: తమిళనాడులో భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. సేలం-చెన్నై జాతీయ రహదారిపై ఈ భారీ బంగారు నగలను అధికారులు పట్టుకున్నారు. సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ. 37.57 కోట్ల విలువైన 234 కిలోల బంగారు ఆభరణాలను శనివారం ఉదయం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇంత భారీ ఎత్తున నగలు పట్టుబడటం ప్రాధాన్యం సంతరించుకుంది. పట్టుబడిన బంగారు ఆభరణాలకు సంబంధించి ఎలాంటి ఆధారులు లేవు. దాంతో నగలన్నింటినీ స్వాధీనం చేసుకున్న అధికారులు గంగపల్లి ట్రెజరీకి అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. డ్రైవర్, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.