రెండు బస్సులు ఢీకొని 16 మంది మృతి
సోనోరా: రెండు బస్సులు బకదానినొకటి ఢీకొని అక్కడిక్కడే 16 మంది గని కార్మికులు మరణించిన సంఘటన ఉత్తర మెక్సికో సరిహద్దు ప్రాంతంలో చోటుచేసుకుంది. మెక్సికోలోని సోనోరాలో జరిగిన ఈ ప్రమాదంలో మరో 14 మంది గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున నోషీ బ్యుయెనా గనికి చెందిన కార్మికులను తరలిస్తుండగా రెండు బస్సులు ఢీకొన్నాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. మృతి చెందిన వారు బస్సులోనే ఇరుక్కుపోయారు. సహాయక సిబ్బంది వారిని బయటకు తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో రెండు బస్సులు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.