రెండు లారీలు దగ్ధం.. వ్యక్తి సజీవదహనం

శామీర్ పేట్: రాజీవ్ రహదారిపై శామీర్‌పేట్‌లోని ఎస్బిఐ బ్యాంకు లారీ – ఆయిల్ ట్యాంకర్ ఢీ కొన్న ఘటనలో రెండు లారీలు దగ్ధం అయ్యాయి. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి సజీవ దహనమయ్యాడు. హైదరాబాద్ నుండి తమిళనాడు సేలంకు వెళ్తున్న కంటైనర్ ను లారీ ఓవర్టేక్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ఢీ కొని మంటలు రేగి కంటైనర్ లో ఉన్న ఒకరు మంటల్లో కాలిపోయారు. ఘటనా స్థలానికి చేరుకు ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.