రేపు, ఎల్లుండి బ్యాంకుల సమ్మె
న్యూఢిల్లీ: రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన దాదాపు పది లక్షల మంది బ్యాంకింగ్ ఉద్యోగులు ఈ నెల 15, 16 తేదీల్లో సమ్మె చేయనున్నారు. ఇప్పటికే ఈ నెల 13న రెండో శనివారం, 14న ఆదివారం బ్యాంకింగ్ సేవలు ఉండవు. ఇక సోమ, మంగళవారాల్లో ఉద్యోగుల సమ్మె వల్ల వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి. దీంతో బ్యాంకింగ్ సేవలపై తీవ్ర ప్రభావమే కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.