రేపు టిఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో మంచిర్యాలలో 2కె రన్

మంచిర్యాల: స్వామి వివేకానంద జయంతి (జనవరి 12) సందర్భంగా రేపు (మంగళవారం) టిఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలో 2 కె రన్ నిర్వహిస్తున్నట్లు నడిపెల్లి చారిటబుల్ ట్రస్టు చైర్మన్ విజిత్ రావు తెలిపారు. ఉదయం 6.30 గంటలకు పట్టణంలోని ఐబి చౌరస్తాలో 2కె రన్ మొదలవుతుందని, యువకులు, టిఆర్ ఎస్ పార్టీ యూత్ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.