రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. రేపు, ఎల్లుండి కేసీఆర్ ఢిల్లీలోనే ఉండబోతున్నారు. కరోనా తరువాత కేసీఆర్ మొదటిసారిగా ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీలో ప్రధానితో సహా అనేకశాఖల మంత్రులను కేసీఆర్ కలవబోతున్నారు. రేపు కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఢిల్లీలో ప్రధానితో సహా అనేకమంది మంత్రులను కూడా కేసీఆర్ కలవబోతున్నారు. ఎల్లుండి టిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి పూజ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా రైతు సంఘాల నేతలతో సమావేశమయ్యే అవకావం కూడా ఉంది. ఒకవైపు హస్తినలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతిస్తూనే పలువురు కేంద్ర మంత్రులను కేసీఆర్ కలవనుండడం ఆసక్తికరంగా మారనుంది.