రేపు సాయంత్రం తెలంగాణ మంత్రివ‌ర్గ స‌మావేశం

హైద‌రాబాద్ : రేపు (శ‌నివారం)సాయంత్రం 5 గంట‌ల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో రాష్ర్ట మంత్రివ‌ర్గం స‌మావేశం కానుంది. ఈ స‌మావేశంలో అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టాల్సిన చ‌ట్ట‌స‌వ‌ర‌ణ బిల్లుల‌ను ఆమోదించే అవ‌కాశం ఉంది. యాసంగిలో నిర్ణీత పంట‌ల సాగు విధానం అమ‌లు, ధాన్యం కొనుగోలుపై కూడా చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.  ముందుగా శ‌నివారం మ‌ధ్యాహ్నం 2:30 గంట‌ల‌కు వ్య‌వ‌సాయ, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు. యాసంగిలో అమ‌లు చేయాల్సిన నిర్ణీత పంట‌ల సాగుపై చ‌ర్చించనున్నారు. గ్రామాల్లోనే పంట‌ల కొనుగోలుపై అధికారుల‌కు సీఎం కేసీఆర్ ప‌లు సూచ‌న‌లు చేయ‌నున్నారు. కరొనా ముప్పు ఇంకా తొలగనందున రైతుల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వ్యవసాయ ఉత్పత్తలను కోనుగోలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ కొనుగోళ్లకు సంబంధించిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి ఈ సమావేశంలో సమీక్షిస్తారు.

Leave A Reply

Your email address will not be published.