రేపటి నుంచి పాలిటెక్నిక్ కళాశాలలకు వేసవి సెలవులు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాలిటెక్నిక్ కాలేజీలకు రేపటి (5వ తేదీ, బుధవారం) నుంచి వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. వేసవి సెలవులు మే 31వ తేదీ వరకు ఉంటాయని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ స్పష్టం చేశారు.