AP: రైతుకు దొరికిన కోటి 20 లక్షల విలువైన వజ్రం!

కర్నూల్ (CLiC2NEWS): ఏపీలోని కర్నూలు జిల్లాలో జొన్నగిరి, పగిడిరాయి, జి ఎర్రగుడి, పెరవలి ప్రాంతంలో రైతులకు విలువైన వజ్రాలు లభిస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో గత 2 రోజులుగా ఈ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ఈ వజ్రాలు బయటపడుతున్నాయి. తాజాగా చిన్న జొన్నగిరిలో పొలం పనులు చేస్తుండగా ఓ రైతుకు రూ. కోటి 20 లక్షల విలువైన వజ్రం దొరికింది. ఇంత భారీ మొత్తం చెల్లించి ఈ వజ్రాన్ని వేలంలో గుత్తి వ్యాపారులు కొనుగోలు చేసినట్లు తెలిసింది. అదే బహిరంగ మార్కెట్ లో రూ. 3 కోట్లకు పైగా విలువ చేస్తుందని వజ్ర వ్యాపారులు చెబుతున్నారు. ఏడేళ్ల క్రితం జొన్నగిరికి చెందిన వ్యక్తికి రూ.37 లక్షల విలువైన వజ్రం లభ్యమైనట్లు గ్రామస్తులు తెలిపారు. ఇంత భారీ మొత్తం రావడంతో రైతు కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది.