రైతుల ఆవేదనను వినాలి : రాహుల్‌

ఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ.. ఆందోళన చేస్తున్న రైతుల ఆవేదనను వినాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ డిమాండ్‌ చేశారు. రైతుల ఆవేదనకు మట్టిలోని ప్రతి రేణువు ప్రతిస్పందిస్తోందని.. బిజెపి ప్రభుత్వం సైతం వినాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఈ మేరకు రైతుల ఆందోళనకు సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. కాగా నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు గులాంనబీ ఆజాద్‌, అధిర్‌ రంజన్‌ చౌధురితో కలిసి రాహుల్‌గాంధీ గురువారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ను కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందించిన విషయం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.