రైతు వేదికలు దేశానికే ఆదర్శం : మంత్రి హరీష్ రావు

సంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన రైతు వేదికలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆదివారం జహీరాబాద్ మండలంలోని హుగ్గేల్లి గ్రామంలో రైతు వేదిక భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందన్నారు. మార్కెట్లో ధర ఉన్న పంటలు సాగు చేసేందుకు రైతు వేదికలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్యరావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ తదితరులు ఉన్నారు.