రైలు ప్రయాణికులు మాస్క్‌లు ధరించకపోతే జైలుశిక్ష
న్యూఢిల్లీ: ఇప్పుడిప్పుడే మొదలవుతున్న ప్రయాణాలు.. బస్సులు మొదలైనాయి, ఈ మధ్యకాలంలో రైల్వే శాఖకూడా రైళ్లను నడుపుతోంది. కాగా రానున్న దసరా పండుగను దృష్టిలో ఉంచుకుని రైల్వే భద్రతా దళం(ఆర్‌పిఎఫ్) సవివర మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రయాణీకులు రైళ్లలో ప్రయాణీంచే సమయంలో మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని కోరింది. కరోనా వ్యాప్తికి కారణమయ్యేట్లు ఎవరు ప్రవర్తించినా వారికి అపరాధరుసుం తోపాటు జైలు శిక్ష కూడా ఉంటుందని ఆ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. కరోనా సోకిన వారు రైలు ఎక్కితే వారి పట్ల మరింత కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకొని ఫలితం రాకముందే రైలు ఎక్కినా తీవ్రంగా పరిగణిస్తామని పేర్కొన్నారు. రైళ్లలో ప్రయాణీంచేవారు మాస్క్‌లు ధరించకపోయినా, ధరించినప్పటికీ వాటిని సరిగా ఉపయోగించకపోయినా, భౌతిక దూరం పాటించకపోయినా శిక్షలు తప్పవని పేర్కొన్నారు.