రైల్వే బోర్డు ఛైర్మన్‌గా సునీత్ శర్మ

న్యూఢిల్లీ: రైల్వే బోర్డు నూతన ఛైర్మన్, సీఈవోగా సునీత్ శర్మ నియమితులయ్యారు. సునీత్ శర్మను ఛైర్మన్‌గా నియమిస్తూ కేబినెట్ నియామకాల కమిటీ గురువారం ఆమోదం తెలిపింది. ప్రస్తుత ఛైర్మన్ వినోద్ కుమార్‌కు ఏడాది పాటు పొడిగించిన పదవీకాలం డిసెంబర్ 31తో ముగుస్తుంది. ఈస్ట్రన్ రైల్వే మాజీ జనరల్ మేనేజర్ అయిన సునీత్ శర్మ 1978 బ్యాచ్‌కు చెందిన స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటిస్ ఆఫీసర్.