ర‌ఘునంద‌న్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేకెత్తించిన దుబ్బాక ఫలితాల్లో 1079 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించిన విషయం తెలిసిందే. సంచలన విజయాన్ని నమోదు చేసిన బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ప్రమాణ స్వీకారానికి సిద్ధమయ్యారు. 18వ తేదీన మధ్యాహ్నం ఒంటి గంటకు దుబ్బాక ఎమ్మెల్యేగా రఘునందన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనూహ్య రీతిలో అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతపై గెలుపొందారు. ఈ విజయంతో రాష్ట్ర వ్యాప్తంగా రఘునందన్‌ ఒక్కసారిగా హాట్‌టాపిక్‌గా మారారు. తాజాగా ప్రమాణస్వీకారానికి సిద్ధమయ్యారు.

Leave A Reply

Your email address will not be published.