లాక్ డౌన్ ఆలోచన లేదు: ఆళ్ల నాని
అమరావతి: దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎపిలో కూడా కరోనా విజృంభిస్తోంది. అయితే కోవిడ్ ను ఎద్కోవటానికి ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని.. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టనున్నాం అని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. “కోవిడ్ హాస్పిటళ్ళు, కోవిడ్ కేర్ సెంటర్లు, బెడ్స్ సంఖ్య పెంచమని ముఖ్యమంత్రి ఆదేశించారు. లాక్ డౌన్, కర్ఫ్యూ వంటివి అమలు చేసే ఆలోచన లేదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మాస్కులు, శానిటైజేషన్, భౌతిక దూరం పాటించటం, వ్యాక్సినేషన్ కు ముందుకు రావాలని“ మంత్రి తెలిపారు.