లాఠీచార్జి జరగలేదు : టీటీడీ చైర్మన్

తిరుపతి : తిరుమలలో స్వామి దర్శనం కోసం వస్తున్న భక్తులపై ఎక్కడా లాఠీచార్జి జరగలేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. భక్తులపై లాఠీచార్జి జరిగినట్లు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు చైర్మన్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు. వైకుంఠ ఏకాదశి దర్శనం ఏర్పాట్లలో టీటీడీ యంత్రాంగం సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడటం తనకు ఇష్టం లేదని విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు.