లబ్ధిదారులకు ఆటోట్రాలీలు, చెక్కులు పంపిణీ చేసిన విప్ బాల్క సుమన్

మంచిర్యాల: మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో శనివారం పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్లొన్నారు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్. స్థానిక ట్రైబల్ వెల్ఫేర్ డిపార్మెంట్ ద్వారా అర్హులైన ఇద్దరు లబ్ది దారులకు సుమారు 11 లక్షల విలువచేసే రెండు ఆటో ట్రాలీలను పంపిణీ చేశారు.

అలాగే భీమారం మండలం ఎలకేశ్వరం గ్రామంలో విద్యుత్ ప్రమాదంలో మరణించిన పశువుల యజమానులకు సాయం అందించారు. వారిలో పదిమందికి మొత్తంగా 6 లక్షల 80 వేల రూపాయల నష్టపరిహారం అందించారు.

పంచాయితీరాజ్, రోడ్లు భవనాలు ఇంజనీరింగ్, ఫారెస్ట్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు మరియు నేషనల్ హైవే అధికారులతో చెన్నూర్ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు.

అలాగే చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో క్రిస్మస్ పండగ పురస్కరించుకొని క్రిస్టియన్ మైనార్టీలకు ప్రభుత్వ కానుకల పంపిణీ చేశారు. రాష్ట్రం ఏర్పడి, అధికారంలోకి వచ్చిననాటి నుంచే టీఆర్‌ఎస్ సర్కారు అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ ఆయా వర్గాల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చీరెలు పెడుతుండగా, రంజాన్‌కు ముస్లింలకు కొత్త బట్టలు అందజేస్తున్నది. క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్ మైనార్టీల్లోని పేదలకు ఒక చీరె, జాకెట్, ప్యాంట్, షర్ట్‌తోపాటు చుడీదార్‌తో కూడిన ఒక కిట్‌ను అందజేస్తున్నది.
