వంతెన కూలి కిందపడ్డ మెట్రో ట్రైన్.. 15 మంది మృతి

మెక్సికో : మెక్సికో కో ఘోర ప్రమాదం సంభవించింది. వంతిన కూలి దానిపై వెళ్తున్న మెట్రో రైలు కిందపడగా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని మెక్సికో సిటీలో మెట్రో రెలు ప్రయాణిస్తుండగా వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మెట్రో రైలు వంతెన కింద ఉన్న పలు వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. రెస్క్యూ బృందాలు సహాయకచర్యలు చేపట్టాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అంతర్జాతీయ మీడియా సంస్థలు అంచనా వేస్తున్నాయి.