వాటర్‌ హీటర్‌ తగిలి తల్లి, ఇద్దరు కుమారుల మృతి..

హాలహర్వి: కర్నూలు జిల్లా హాల‌హ‌ర్వి మండ‌లం గెళ్లెంగ గ్రామంలో విషాదం చోటుచేసుకంది. విద్యుదాఘాతంతో త‌ల్లి, ఇద్ద‌రు చిన్నారులు మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన స‌మాచేరం మేర‌కు.. స‌తీష్‌, క‌విత దంప‌తులు గ్రామంలో కిరాణా దుకాణం నిర్వ‌హిస్తున్నారు. ఎప్ప‌టిలాగే ఈ రోజు ఉద‌యం కూడా హీట‌ర్‌తో నీళ్లు వేడే చేసే స‌మ‌యంలో వాట‌ర్ హీట‌ర్‌కు ప్ర‌మాద‌వ‌శాత్తు చేయి త‌గ‌ల‌డంతో క‌విత (35) విద్యుదాఘాతానికి గురైంది. ప‌క్క‌నే ఉన్న చిన్నారులు నిశ్చ‌ల్ కుమార్ (11), వెంక‌ట‌సాయి (8) త‌ల్లిని ప‌ట్టుకోవ‌డంతో ముగ్గురూ అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లీకొడుకుల మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

Leave A Reply

Your email address will not be published.