విజయాలకు పొంగిపోం.. అపజయాలకు కుంగిపోం
దుబ్బాక ఓటమిపై స్పందించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్: విజయాలకు పొంగిపోం.. అపజయాలకు కుంగిపోం.. అని తెలంగాణ ఐటి, పురపాలక మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు. దుబ్బాక ఉప ఎన్నకలో టిఆర్ ఎస్ ఓటిమిపై మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన 2014 జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలో వచ్చిన ఏ ఎన్నిక జరిగినా టీఆర్‌ఎస్ అద్భుతమైన విజయాలు నమోదు చేసిందని చెప్పారు. తాము విజయాలకు పొంగిపోము, అపజయాలకు కుంగిపోమని చెప్పారు. దుబ్బాక ఫలితం మేము ఆశించినట్లు రాలేదని వెల్లడించారు. ఈ ఓటమి మేము అప్రమత్తం అవడానికి ఉపయోగపడుతుందనిపేర్కొన్నారు. ఓటమిపై సమీక్ష చేసి లోటుబాట్లు తెలుసుకుంటామన్నారు. ఈ ఎన్నికల్లో ఓటు వేసిన 62 వేల మంది ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీని గెలిపించడానికి అహర్నిశలు శ్రమించిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. దుబ్బాక తీర్పును లోతుగా సమీక్షించుకుంటామని కేటీఆర్ వెల్లడించారు.