విలీన గ్రామాల్లో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు అవకాశం
హైదరాబాద్: తెలంగాణ సర్కార్ మరో సదాబైనామాల క్రమబద్ధీకరణ విషయంలో మరో నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో విలీనమైన గ్రామాల్లో సాదాబైనామాల ద్వారా జరిగిన వ్యవసాయ భూముల క్రయవిక్రయాలను ఉచితంగా క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దరఖాస్తు చేసుకునేందుకు వారం రోజులపాటు గడువు ఇవ్వాలని.. దీనికి సంబంధించి వెంటనే ఉత్తర్వులను జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. జనగామా జిల్లా కొడకండ్లలో రైతు వేదిక ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వరంగల్ కార్పోరేషన్‌లో విలీనమైన గ్రామాల్లో కూడా సాదా బైనామాలను క్రమబద్ధీకరించాలని కోరడంపై సీఎం సానుకూలంగా స్పందించారు.
Hon’ble CM instructed Chief Secretary Sri Somesh Kumar to issue the necessary orders in this regard immediately. The CM held a meeting with the Ministers, MPs, MLAs and MLCs from the erstwhile Warangal District after the inauguration of Rythu Vedika at Kodakandla.
— Telangana CMO (@TelanganaCMO) October 31, 2020