విశాఖలో ప్రైవేట్‌ బస్సు బోల్తా

విశాఖప‌ట్నం: విశాఖ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. బుధవారం అర్థరాత్రి చెన్నై నుండి విశాఖ వెళ్తున్న ఒక ఒక ప్రైవేట్‌ బస్సు బ్రిడ్జిపై నుండి 14 అడుగుల లోతులో వరహానది ఒడ్డున పడిపోయింది. ఎస్‌.రాయవరం మండలం పెనుగొండ సమీపంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో బస్సులో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి స్థానికులు గుర్తించారు. క్షతగాత్రులను నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారికి ఎలాంటి ప్రాణాపాయ పరిస్థితి లేదని పోలీసులు చెబుతున్నారు. రాత్రివేళ డ్రైవర్‌కు నిద్ర రావడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.