వీఆర్వోపై మహిళల దాడి

తాంసి: భూ ప్రక్షాళనలో తమ భూమి తక్కువగా నమోదు చేశారనే ఆగ్రహంతో రెవెన్యూ అధికారిపై మహిళా రైతులు దాడికి దిగారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం కుప్పర్ల గ్రామ పంచాయతీ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. మండలంలోని వడ్డాడికి చెందిన రైతు జంగ చినగంగారెడ్డి, పొన్నారి గ్రామానికి చెందిన తొకల పెదస్వామికి చెందిన భూముల్లో కొంత భూమిని రోహిత్ ఇతరుల పేరిట మార్చాడు. రైతులిద్దరూ పత్తి పంటను అమ్మడానికి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు వెళ్లగా, వారి పేరిట భూమి లేదని సిబ్బంది స్పష్టంచేశారు. బాధితులు తాంసి తహసిల్ కార్యాలయానికి వెళ్లగా వీఆర్వో రోహిత్ కనపడగానే ఇద్దరు రైతులు, మహిళలు చెప్పులతో దాడికి దిగారు. తాసిల్దార్‌ను వివరణ కోరగా భూ సర్వే చేసి రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు.