వీడియో: మానవత్వం చాటుకున్న మహిళా ఎస్సై

శ్రీకాకుళం:  న‌వ‌మాసాలు మోసి క‌నిపెంచిన త‌ల్లిదండ్రులు చ‌నిపోయినా ప‌ట్టించుకోని పిల్లలున్న ఈ క‌లికాలంలో ఓ మ‌హిళా ఎస్సై అనాథ శ‌వాన్ని భుజాల‌మీద మోసుకెళ్లారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం జరిగింది. కాశీబుగ్గ సమీపంలోని అడవి కొత్తూరు గ్రామ శివారులో ఓ వృద్ధుడు మృతి చెందినట్లు ఎస్సై శిరీషకు స్థానికుల నుంచి సమాచారంతో అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.

మృత‌దేహాన్ని అక్క‌డి నుండి త‌ర‌లించి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించడానికి ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌డంతో ల‌లిత చారిట‌బుల్ ట్ర‌స్టు నిర్వాహ‌కుల సాయంతో ఎస్సై శిరీష భుజంపై మోసుకెళ్లారు. పొలం గ‌ట్ల మీద నుంచి దాదాపు 2.కి.మీ. మోసుకుంటూ వెళ్లి దగ్గర్లోని రోడ్డుపైకి చేర్చారు. అనంతరం లలిత చారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్వాహకులకు మృతదేహాన్ని అప్పగించి అంత్యక్రియలు జరిపించారు.

మాన‌వ‌త్వం చాటుకున్న‌ ఎస్సై శిరీషను ఎపి డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌తో పాటు తెలంగాణ పోలీస్‌శాఖ అభినందించింది. మృతదేహాన్ని శిరీష మోసుకెళ్తున్న వీడియోను ఏపీ పోలీస్‌శాఖ తమ అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ శాఖ కూడా సెల్యూట్‌ మేడమ్‌ అంటూ అభినందించింది.

 

Leave A Reply

Your email address will not be published.