వేప చెట్టు నరికిన వ్య‌క్తికి రూ.62 వేలు ఫైన్

హైదరాబాద్ : నగరంలోని సైదాబాద్‌లో చెట్టును నరికిన ఓ వ్యక్తికి ఏకంగా రూ.62 వేలకు పైగా జరిమానా విధించారు అట‌వీశాఖ అధికారులు. నలభై ఏళ్లుగా ఉంటున్న భారీ వేపచెట్టును ఇంటి నిర్మాణానికి అడ్డొస్తుందని స్థలం యజమాని కొట్టేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన 8వ తరగతి విద్యార్థి బాధ్యతాయుతంగా వ్యవహరించి అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అటవీశాఖ టోల్ ఫ్రీ నంబర్ (1800 425 5364) కు ఫోన్ చేసిన ఓ విద్యార్థి.. తమ ఇంటి సమీపంలో జరగిన ఈ ఘటనను వారి దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో, విచారణ చేపట్టిన అటవీ శాఖ ఈస్ట్ అధికారులు అనుమతి లేకుండా చెట్టును నరికివేశారని నిర్ధారించారు. బాధ్యులను గుర్తించి వారికి రూ.62, 075 జరిమానా విధించి ఆ మొత్తాన్ని వసూలు చేశారు. బాధ్యతాయుతంగా వ్యవహరించిన బాలుడిని అధికారులు అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.