వేస‌వికాలంలో ముఖం కాంతివంతంగా ఉండాలంటే..

ఇది వేస‌వికాలం. ఎటు చూసినా మామిడిపండ్లు క‌నిపిస్తుంటాయి. మామిడి పండ్లు తిన‌డానికే కాకుండా సౌంద‌ర్య సాధ‌నంగా కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు. తీయని మామిడి పండులో సౌందర్య గుణాలు చాలా ఉన్నాయి. ఎండకు కందికపోయిన చర్మాన్ని మామిడి ఫేస్‌ప్యాక్‌తో కాంతివంతంగా మార్చుకోవ‌చ్చు…

 

  • విటమిన్‌ ‘A’, బీటా-కెరోటిన్‌ పుష్కలంగా కలిగి ఉండే మామిడి పండు చర్మాన్ని పునరుద్ధపరచి, కణాల జీవితకాలాన్ని పెంచుతుంది. ప్రకాశవంతమైన చర్మాన్ని అందిస్తుంది 
  • పొడి చర్మానికి మామిడి సొగసులు: బియ్యాన్ని కొద్దిగా బరకగా పిండి పట్టించుకోవాలి. ఒక చెంచా పిండిలో చెంచా మామిడి గుజ్జు, అర చెంచా తేనె కలిపి చర్మానికి రాయాలి. ఐదు నిమిషాల పాటు మర్ధన చేసి ఆరనివ్వాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం నునుపుగా కొత్త కాంతులతో వెలిగిపోతుంది. 
  • ఒక చెంచా మామిడిపండు గుజ్జు, సగం చెంచా తేనె, పాల పొడిని కలిపి తయారు చేసిన మిశ్రమాన్ని ముఖం, ముక్కు ప్రాంతంలో ఉండే చర్మంపై వలయాకార రూపంలో మర్దన చేయండి. దీంతో బ్లాక్‌ హెడ్స్(నల్లటి వలయాలు) తొలగిపోతాయి. 
  • మామిడిలో విటమిన్‌ ‘C’ అధికంగా ఉంటుంది. ఇది మొటిమలను తగ్గిస్తుంది. మామిడి, పెరుగు కలిపి తయారు చేసిన ఫేస్‌ ప్యాక్‌ ను వాడటం వల్ల ముఖంపౖౖె ఉండే డార్క్‌ స్పాట్స్‌ (నల్లటి వలయాలు) తొలిగిపోతాయి.

 

Leave A Reply

Your email address will not be published.