వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల

అమరావతి: టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు వైస్తార్‌సీపీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రమేష్‌బాబుకు కండువా కప్పి తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం పార్టీలోకి ఆహ్వానించారు. యలమంచిలి, పెందుర్తి నుంచి రమేష్‌బాబు గతంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.