వ్యవసాయం విలువ తెలుసు: ఎపి సిఎం జగన్
అమరావతి: సోమశిల హైలెవెల్ కెనాల్ ఫేజ్-2కు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. నెల్లూరు జిల్లాలోని దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేసే దిశగా సోమశిల హైలెవెల్ కెనాల్ ఫేజ్-2కు వర్చువల్ విధానంలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. కాగా.. సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్ -1 నిర్మాణ పనులు ఇప్పటికే జరుగుతున్నాయి. తాజాగా.. 460 కోట్ల రూపాయల వ్యయంతో ఫేజ్-2 నిర్మాణ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ కాలువ పనులు పూర్తయితే మెట్ట ప్రాంతాలైన ఉదయగిరి, వింజమూరు, దుత్తల్లూరు, ఆత్మకూరుతో పాటు ప్రకాశం జిల్లాలోని పలు గ్రామాలకు నీరు పుష్కలంగా అందుతుంది. దశాబ్దాల కాలంగా మెట్ట ప్రాంత వాసులు కలలుగన్న సాగునీటి సమస్యకు పరిష్కారం దొరికినట్లేనని ఆ ప్రాంతవాసులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడుతూ.. నీరు, వ్యవసాయం విలువ తెలిసిన ప్రభుత్వం తమదని పేర్కొన్నారు. ప్రాజెక్టు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తామని తెలిపారు. జలయజ్ఞం పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని సీఎం స్పష్టం చేశారు.పెన్నా నది నీటిని సద్వినియోగం చేసుకుంటున్నామని ఈ సందర్భంగా సీఎం తెలిపారు. నెల్లూరు జిల్లాలోని మరిన్ని ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. నీరు, వ్యవసాయం విలువ తెలిసిన ప్రభుత్వం తమదని పేర్కొన్నారు. ప్రాజెక్టు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తామని తెలిపారు. జలయజ్ఞం పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని సీఎం స్పష్టం చేశారు.
2020-21లో 6 ప్రాధాన్యత ప్రాజెక్టులను పూర్తిచేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. 2022 ఖరీఫ్‌కు నీరిచ్చేలా పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని సీఎం మాటిచ్చారు. నీటి విషయంలో ఎక్కడా రాజీపడేది లేదని తేల్చి చెప్పారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కృష్ణాపురం వద్ద రెండో దశ పనులకు శంకుస్థాపన చేశారు. కృష్ణాపురం వద్ద కార్యక్రమంలో మంత్రులు అనిల్‌కుమార్, గౌతమ్‌రెడ్డి పాల్గొన్నారు.