వ్యవసాయేతర ఆస్తులకు హక్కు పత్రాలుః కామారెడ్డి కలెక్టర్

కామారెడ్డిః వ్యవసాయేతర ఆస్తులకు హక్కు పత్రాలను ప్రభుత్వం ఇస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. తాడ్వాయి మండలం కృష్ణాజివాడి లో ఆస్తుల నమోదు సర్వేను పరిశీలించారు. లింగంపేట లో ఆస్తుల నమోదు వివరాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల వారీగా సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. కృష్ణాజివాడి లో పల్లె ప్రకృతి వాన్ని పరిశీలించారు. మొక్కలకు పాదులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆస్తుల నమోదు సర్వేను గ్రామీణ ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 2 రోజుల్లో సర్వే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఎంపీడీవో లు లక్ష్మీ తాడువాయి, మల్లికార్జున్ రెడ్డి లింగంపేట, అధికారులు పాల్గొన్నారు.