వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే శారీరకంగా దృఢంగా ఉండాలి
ఒలంపిక్ అసోసియేషన్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు బి.జి.ఆర్...

ఆదిలాబాద్ : శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే మనిషి తన జీవితంలో అనుకున్నది సాధించవచ్చని ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో చేపడుతున్న ఫిట్ ఇండియా మూమెంట్ లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చేపట్టిన ఫిట్ ఇండియా మూమెంట్ రన్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో బుధవారం నిర్వహించిన ఫిట్ ఇండియా రన్ ను ఆయన ప్రారంభించారు. ఈ మేరకు గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిసెంబర్ 1 నుండి 31వ తేదీ వరకు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ, నెహ్రు యువ కేంద్రం, ఎన్.సి.సిల ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా మూమెంట్ రన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరు వ్యాధుల బరినపడకుండా ఉండాలంటే ముందుగానే వ్యాధులు రాకుండా ఎప్పటికప్పుడు శారీరకంగా దృఢంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే ప్రజల్లో ఎక్కువగా బీపీ, షుగర్ లాంటి వ్యాధులు పెరిగిపోతున్నాయని, వీటి నుండి రక్షణ పొందాలంటే యోగ, రన్నింగ్, సైక్లింగ్, వ్యాయామం తదితర వాటిపై దృష్టి సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి వెంకటేశ్వర రావు,Parthasarathi ,NKYk Officer Akhil పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.