వరంగల్ జిల్లాలో కోడి పందాలు నిర్వహిస్తున్న ఐదుగురి అరెస్టు
వరంగల్: జిల్లాలోని హసన్పర్తి పరిధిలోని జయగిరి గ్రామ శివారులో గురువారం కోడి పందాలు నిర్వహిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్లు బి. నందిరామ్, మధు సిబ్బందితో కలిసి రైడ్ చేశారు. ఈ సందర్భంగా దేవరకొండ రాములు, దేవరకొండ భిక్షపతి, యాకుబ్ పాషా, ఓని సుధాకర్, సయ్యద్ మౌలాలి లను అరెస్టు చేశారు. నాలుగు పందెం కోళ్లతో పాటు సంఘటనా స్థలం నుంచి రూ.3,260 నగదు, నాలుగు సెల్ఫోన్లు, మూడు బైక్లు స్వాధీనం చేసుకున్నారు.