శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత
శంషాబాద్: రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ. 1.2 కోట్ల విలువైన 2.4 కిలోల బంగారాన్ని హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి బంగారం స్వాధీనం చేసుకున్నారు.