శిరోజాల సంరక్షణ

శిరోజాల సంరక్షణ

 

అమ్మాయిలకు శిరోజాలే అందం. పాత కాలంలో ఒక్కొక్కరికి జుట్టు ఒత్తుగా, పొడవుగా ఉండడంతోపాటు ఆకర్షణీయంగా ఉండేది. అందమైన కురులు నిస్సందేహంగా వ్యక్తిగత సౌందర్యాన్ని ఇనుమడింపచేసినా, జుట్టు ఉండేది కేవలం సౌందర్యం కోసమే కాదు. దీనివల్ల ఇతరత్రా ఉపయోగాలు చాలానే ఉన్నాయి. ఉదాహరణకు మనకు దెబ్బలు తగలకుండా జుట్టు ఒక ఆచ్ఛాదనలా రక్షిస్తూ ఉంటుంది. అలాగే ఎండవేడి నుంచి, అతినీల లోహిత కిరణాల నుంచి రక్షణ కవచంలా కాపాడుతూ ఉంటుంది. ఇప్పుడు వాతావరణ కాలుష్యం, ఒత్తిడి కారణంగా ప్రతిఒక్కరిలో జుట్టు సమస్యలు మొదలవుతున్నాయి. నేటి తరాన్ని అధికంగా పట్టి పీడిస్తున్న సమస్యల్లో జుట్టు రాలడం ఒకటి. ప్రమాదకరమైన శారీరక రుగ్మత కాకపోయినప్పటికీ ఎంతో మందిని ఈ సమస్య ఆందోళనతో సతమతమయ్యేలా చేస్తోంది. ఆడవారినీ, మగవారినీ… కొద్దిపాటి తేడాలతో ఇరువర్గాలనీ క్షోభకు గురిచేయడం వల్ల ఇది ఒక పెద్ద వ్యక్తిగత సమస్యగా పరిణమించింది. ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్‌తోనే జుట్టు సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

చిట్కాలు…

* కోడిగుడ్డు తెల్లసొనలో రెండు టీ స్పూన్‌ల బోరిక్‌ పౌడర్ కలిపి జుట్టు కుదుళ్లకు పట్టించి అరగంట తరువాత తలను శుభ్రపరుచుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తూ ఉంటే జుట్టుకు మంచి పోషణ లభిస్తుంది.
* కొన్ని ‘టీ’ ఆకులు వేసి నీళ్లను మరిగించాలి. చల్లారిన తర్వాత తలకు పట్టిస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.
* తులసి ఆకులను శుభ్రపరిచి మెత్తగా పేస్టు చేసి జుట్టు కుదుళ్లకు పట్టించి ఆరిన తర్వాత కడిగేస్తే పేలు అరిక‌ట్ట‌వ‌చ్చు, చర్మసమస్యలు రావు.
* నాలుగు ‘టీ’ స్పూన్ల నిమ్మరసంలో రెండు ‘టీ’ స్పూన్‌ల కొబ్బరి పాలు కలుపాలి. దానిని జుట్టు కుదుళ్లకంతటికీ పట్టించి అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా పదిహేను రోజులకోసారి ఇలా చేస్తూ ఉంటే శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి.

1 Comment
  1. SEO says

    Wow, superb weblog structure! How lengthy have you been running a blog for? you made running a blog glance easy. The total look of your site is excellent, as neatly as the content material!!

Leave A Reply

Your email address will not be published.