శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు
హైదరాబాద్: గత రెండు రోజులుగా పసిడి ధరలు నేల చూపులు చూస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం రేట్లు పెరిగిపోవడం ఇందుకు ప్రధాన కారణం అని చెప్పవచ్చు. గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతూనే ఉన్నాయి. గత వారం రోజులుగా పెరిగిన బంగారం ధర.. ఇవాళ మాత్రం కాస్త తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు కిందికి కదలడంతో బులియన్ మార్కెట్‌లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి రూ. 48,650 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి రూ. 44,590 కు చేరింది. ఇక వెండి ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి. కిలో వెండి ధర రూ. 74,000 వద్ద కొనసాగుతోంది. ఇది ఎప్పటి నుంచో బంగారం కొనాలని ఎదురుచూస్తున్నవారికి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు.