శేరిలింగంప‌ల్లి డివిజ‌న్‌లో సానిటైజేషన్

హైద‌రాబాద్ /శేరిలింగంప‌ల్లి (CLiC2NEWS): దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా క‌రోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్ప‌టికే తెలంగాణ ప్ర‌భుత్వం క‌రోనా క‌ట్ట‌డికోసం ప‌లు ఆంక్ష‌లు విధించింది. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లో జిహెచ్ ఎంసి ప‌లు చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ క్ర‌మంలోని శేరిలింగంప‌ల్లి డివిజ‌న్‌లోని ప్ర‌శాంత్‌న‌గ‌ర్‌లో సోమ‌వారం కాలనీల్లోని ప్రధాన దారులు, కాలువలు, ఇంటి పరిసరాల్లో సానిటైజర్, సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి చేశారు. ఈ కార్య‌క్ర‌మాన్ని స్థానిక కార్పొరేట‌ర్ నాగేంద‌ర్ యాద‌వ్ ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షించారు. ఈ కార్య‌క్ర‌మంలో జిహెచ్ ఎంసి అసిస్టెంట్ ఇంజినీర్ కిర‌ణ్‌, దాసోజు శ్రీ‌నివాస్, వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి విజ‌య్ తో పాటు ప‌లువురు కాల‌నీ స‌భ్యులు పాల్గొన్నారు. కాల‌నీల్లో వారంతా అవ‌స‌రం ఉంటే నే బ‌య‌ట‌కు రావాల‌ని వారు పేర్కొన్నారు. అంద‌రూ సెల్ఫ్ లాక్‌డౌన్ పాటించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.