NEET 2026: నీట్ నోటిఫికేష‌న్‌ విడుద‌ల‌

NEET UG 2026: వైద్య విద్య‌లో ప్ర‌వేశాల‌కు నిర్వ‌హించే నీట్ (NEET 2026) ప‌రీక్ష‌కు నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ నెల 8వ తేదీ నుండి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తారు. తెలుగు, ఇంగ్లిష్‌, హిందీతో పాటు దేశ‌వ్యాప్తంగా 13 బాష‌ల్లో ఈ ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. ఈ ప‌రీక్ష మే 3వ తేదీన మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుండి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హిస్తారు. ఈ మేర‌కు నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఆదివారం ప్ర‌క‌టించింది.  నేష‌న‌ల్ ఎలిజిబిలిటి క‌మ్ ఎంట్ర‌న్స్ టెస్ట్ (NEET) ద్వారా దేశ‌వ్యాప్తంగా ఉన్న మెడిక‌ల్ కాలేజీల‌లో విద్య‌న‌భ్య‌సించే అవ‌కాశం ఉంటుంది. ఎంబిబిఎస్‌, బిడిఎస్‌, బిఎస్ ఎం ఎస్‌, బియుఎంఎస్ , బిహెచ్ ఎంస్ కోర్సుల‌ల్లో ప్ర‌వేశాల‌కు అర్హులైన విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఫిబ్ర‌వ‌రి 8 నుండి మార్చి 9వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

జ‌న‌ర‌ల్ కేట‌గిరీ అభ్య‌ర్థుల‌కు ద‌ర‌ఖాస్తు ఫీజు రూ. 1700 గా ఉంది. జ‌న‌ర‌ల్ ఇడ‌బ్ల్యు ఎస్‌/ ఒబిసి- ఎన్ సి ఎల్ అభ్య‌ర్థుల‌కు రూ. 1600 , ఎస్ సి/ ఎస్ టి / దివ్యాంగులు/ థ‌ర్డ్ జెండ‌ర్ అభ్య‌ర్థుల‌కు రూ. 1000గా నిర్ణ‌యించారు.

విద్యార్థులు ఏమైనా సందేహాలు ఉంటే 011-40759000, 011-69227700 ఫోన్ నెంబ‌ర్ల‌ను సంప్ర‌దించ‌వ‌చ్చ‌ని తెలిపారు.

Education News:   TG ICET: ఐసెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌

1 Comment
  1. […] NEET 2026: నీట్ నోటిఫికేష‌న్‌ విడుద‌ల‌ […]

Leave A Reply

Your email address will not be published.