`శౌర్య` పరీక్ష సక్సెస్
ఒడిశా: 800 కి.మీ. దూరంలోని ఉన్న లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉన్నమరో అణు సామర్ధ్య క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. దీనిని ఒడిశాలోని బాలాసోర్ తీరంలో విజయవంతంగా పరీక్షించింది. ఇది భూతలం నుంచి భూతలంపైకి ప్రయోగించే శౌర్య న్యూక్లియర్ బాలిస్టిక్ క్షిపణి చాలా తేలికైనదని అని డీఆర్‌డీవో వెల్లడించింది. శౌర్య క్షిపణితో ప్రస్తుతం ఉన్న క్షిపణి వ్యవస్థకు మరింత బలం చేకూరుతుందని అధికారులు తెలిపారు. కాగా ఇప్పటికే బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిని డీఆర్‌డీవో బుధవారం విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసిందే. ఒడిశాలోని చాందీపూర్ రేంజ్ నుంచి ఈ ప్రయోగం నిర్వహించారు. ఈ క్షిపణి 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను విజయవంతంగా చేధించగల సామర్థ్యం కలిగి ఉన్నది.