శ్రీనగర్‌లో న్యాయవాది కాల్చివేత

జమ్ముకశ్మీర్‌ : శ్రీ‌న‌గ‌ర్‌లో ఓ న్యాయ‌వాదిని ఉగ్ర‌వాదులు కాల్చి చంపారు. ఈ రోజు (గురువారం) సాయంత్రం 6.25 గంట‌ల‌కు ప్రముఖ న్యాయవాది, టీవీ ప్యానలిస్ట్ బాబర్ ఖాద్రిని తన హవాల్ నివాసం వద్ద గుర్తుతెలియని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ దాటిలో తీవ్రంగా గాయపడిన బాబర్‌ ఖాద్రిని ఆసుప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు తెలిపారు. తన మరణానికి ముందు బాబార్‌ ఖాద్రి తనపై “అస‌త్య ప్రచారం చేసినందుకు ఒక ఫేస్‌బుక్ అకౌంట్‌పై కేసు నమోదు చేయాలని జమ్ములోని పోలీసులను కోరుతూ స్క్రీన్ షాట్ ట్వీట్ చేశారు. “ఏజెన్సీల కోసం నేను పనిచేస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేసిన స‌ద‌రు షా నజీర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని నేను రాష్ట్ర పోలీసు అధికారులను కోరుతున్నాను. ఈ అసత్య ప్రకటన నా ప్రాణానికి ముప్పు కలిగిస్తుంది” అని ఖాద్రి తన చివరి ట్వీట్‌లో రాశారు.
కాగా గత 24 గంటల్లో ఉగ్రవాదులు కాల్చి చంపిన రెండవ రాజకీయ లేదా సామాజిక కార్యకర్తగా ఖాద్రి నిలిచారు. నిన్న రాత్రి బుద్గాం జిల్లాలోని ఖాగ్ ప్రాంతంలోని బ్లాక్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ సభ్యుడు భూపిందర్ సింగ్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు.

Leave A Reply

Your email address will not be published.