శ్రీరాంసాగర్‌ 8 గేట్ల ఎత్తివేత

నిజామాబాద్‌: ఈ మ‌ధ్య కాలంలో కురిసిన భారీ వ‌ర్షాల‌తో జ‌ల‌శ‌యాలు నిండుకుండ‌ల్లా మారాయి. మ‌హారాష్ట్రలో కురిసిన భారీ వ‌ర్షాల‌కు గోదావ‌రి న‌దికి పోటెత్తిన వ‌ర‌ద‌. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వాన‌ల‌తో శ్రీరాంసాగర్‌ జలాశయంలోకి భారీగా వ‌ర‌ద నీరు చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 36,943 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో అధికారులు గోదావరిలోకి 25వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 1,091 అడుగులు కాగా దాదాపు పూర్తిస్థాయిలో నీరుంది. నీటి నిల్వ సామర్థ్యం 90.31 టీఎంసీలు. జలాశయం గరిష్ఠ మట్టానికి చేరుకోవడంతో అధికారులు ఎనిమిది గేట్లు ఎత్తి 25వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. లోత‌ట్టు ప్రాంతాలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.