శ్రీవారిని ద‌ర్శించుకున్న సిజెఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

తిరుమల (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. శుక్ర‌వారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శనంలో సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు ఆల‌య మ‌హాద్వారం వ‌ద్ద అర్చ‌కులు సంప్ర‌దాయం ప్ర‌కారం వారికి ఇస్త‌క‌ఫాల్ స్వాగం ప‌లికారు. దర్శనం అనంతరం వారికి ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనం అందించారు. తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న అనంత‌రం జస్టిస్‌ ఎన్వీ రమణ దంప‌తులు తిరుచానూరు వెళ్లనున్నారు.

సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జస్టిస్‌ ఎన్వీ రమణ హైదరాబాద్‌కు రానున్నారు. ఇవాళ (శుక్ర‌వారం) మధ్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటారు.

Leave A Reply

Your email address will not be published.