శ్రీశైలానికి పెరిగిన వరద

శ్రీశైలం: రాష్ట్రంలో, ప‌క్క రాష్ట్రమైన క‌ర్ణాట‌క‌లో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు శ్రీ‌శైలం జ‌లాశ‌యానికి భారీగా వ‌ర‌ద నీరు చేరుకుంటుంది.  శుక్రవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలానికి 2,11,543 క్యూసెక్కుల వరద నీరు చేరింది. ఆరు గేట్లను పది అడుగుల మేరకు ఎత్తి 1,66,248 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటి మట్టం 884.20 అడుగులుగా ఉంది. నీటి నిలువ సామర్థ్యం 215 టిఎంసి లకుగాను ప్రస్తుతం 210.9946 టిఎంసిలు గా నమోదైంది.

Leave A Reply

Your email address will not be published.