శ్రీ లక్ష్మీ ఐఎఎస్ కు సముచిత స్థానం లభించడం పట్ల కాపునాడు హర్షం

అమలాపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి ణి శ్రీమతి యర్రా శ్రీ లక్ష్మీ ని పురపాలక సంఘ ప్రిన్సిపల్ కార్యదర్శి గా నియమించడం పట్ల కాపునాడు అమలాపురం పార్లమెంటు అధ్యక్షులు జిన్నూరి సత్య సాయిబాబా, రాష్ట్ర లీగల్ అడ్వయిజర్, న్యాయవాది టి.వి.గోవిందరావులు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. తెలుగు దేశం ప్రభుత్వం హయాంలో కొందరు స్వార్ధపరులు కుట్రలు వల్ల ఆమె ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని వారు తెలిపారు. జగన్మోహన్రెడ్డి కి కాపులు పట్ల ఉన్న ఆదరాభిమానాలు ఆమె నియామకం ద్వారా విదితమవుతుందన్నారు.