షిర్డీ ఆలయం మూసివేత‌

క‌రోనా కోర‌లు చాస్తుండ‌టంతో దేశం మ‌రోసారి ఆంక్ష‌ల వ‌ల‌యంలోకి జారుకుంటోంది. తాజాగా ఆదివారం ఒక్క‌రోజే ల‌క్ష‌కు పైగా కొత్త కేసులు రావ‌డంతో ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న నెల‌కొంది. దీంతో ఆయా రాష్ర్టాలు/ కేంద్ర‌పాలిత ప్రాంతాలు అప్ర‌మ‌త్త‌మ‌వుతున్నాయి. మ‌హారాష్ట్రలో కొవిడ్ ఉగ్ర‌రూపంతో రాత్రిపూట క‌ర్ఫ్యూతోపాటు వీకెండ్‌లో లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్టు అక్క‌డి ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

నేటి రాత్రి నుంచి షిర్డీ ఆల‌యం మూసివేత‌

మహారాష్ట్రలోని షిర్డీలోని సాయిబాబా ఆల‌యాన్ని తాత్కాలికంగా మూసివేయాల‌ని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్ర‌స్ట్ నిర్ణ‌యించింది. ఈరోజు రాత్రి 8 గంటల నుండి ఈ నెల 30 వ‌ర‌కు ఆల‌యం మూసి వేసి ఉంచ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

సాయిబాబా ఆలయంతో పాటు, ప్రసాదాలయ,’క్త నివాస్ కూడా మూసివేయనున్నారు.ఈ స‌మ‌యంలో పూజా కార్య‌క్ర‌మాలు మాత్రం కొన‌సాగ‌నున్నాయి. శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో ప్రారంభించిన కొవిడ్ ఆసుప‌త్రి, ఇత‌ర ఆసుప‌త్రులు మాత్రం ప‌నిచేస్తాయ‌ని ట్ర‌స్టు పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.