షేక్.బహర్ అలీ: అర్ధ చక్రాసనం

అర్ధ చక్రాసనం చేయువిధానం
1. ముందుగా తెల్లవారుజామున రెండు గ్లాసులు నీరు తాగి కాలకృత్యాలు చేసుకొని 10 నిమిషాలు వ్యవధి ఇవ్వండి.
2. ఆసన స్థితిలో నిటారుగా నిలబడండి.
3. ఇప్పుడు వీపు నడుము వద్ద రెండు అర చేతులతో పట్టివుంచి, రెండు ముక్కుల ద్వారా ఊపిరిని వదులుము.
4. మరల ఇప్పుడు ఊపిరిని పీల్చుచు,నిదానంగా నడుము భాగమును వెనుకకు వంచుము. మెడ, కండరములు సాగదీయుచు, తల వెనకకు వంచుము. ఊపిరిని సాధరణంగా పీల్చుము. ఒక నిమిషం అలానే వుంచాలి.
5. ఇప్పుడు శ్వాసను విడుస్తూ నిదానంగా తలను, మెడను, యధా స్థితి కి తేవాలి. ఇలా 5 సార్లు చేయాలి.
ప్రయోజనాలు
1. శ్వాసను తీసుకోవటం వలన ఊపిరితిత్తులకు చక్కని ఆక్సిజన్ అందుతుంది. ఛాతి దృఢంగా మారుతుంది.
2. వెనుకకు మెడ వంగేటపుడు కంఠం సాగటం వలన థైరాయిడ్ గ్రంధి చైతన్యవంతంగా మారును.
3. కాళ్ళ కండరములు, మరియు నడుము, వెన్నుముక, మెడ నరములను చలింపచేయును. తలలో రక్తప్రసరణ చక్కగా జరుగును.
హెచ్చరిక:
1. బిపి ఉంటే నిదానంగా చేయండి.
2. హెర్నియా ఉంటే ఈ ఆసనం చేయరాదు. ఒకవేళ చేయాలనుకంటే యోగ గురువు సమక్షంలో నేర్చుకోని చేయండి.
-షేక్.బహర్ అలీ
యోగచార్యుడు