షేక్.బహర్ అలీ.. ఆరోగ్య చిట్కాలు

మనిషి.. శారీరకంగాను, మానసికంగాను, సామజికంగాను, ఆర్థికంగాను, తను ఉన్న పరిసరాలలో హాయిగా జీవించడాన్ని ఆరోగ్యము అంటారు. ఆరోగ్యము మనిషి ప్రాథమిక హక్కు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యముగా ఉండాలి, ఆరోగ్యముగా ఉండడానికి ప్రయత్నించాలి, మంచి ఆరోగ్య పరిసరాలను కల్పించుకోవాలి. ఆరోగ్యముగా ఉండమని ఇతరులకు సలహా ఇవ్వాలి. ప్రస్తుతం మనం ఉన్న కాల పరిస్థితిని బట్టి ఈ విధంగా మనం ఆచార వ్యవహారాలు కొద్దిగా మార్పు చేసుకొని చక్కని జీవితం గడపవచ్చును.

1. చికిత్సపరమైన, పర్యావరణ సంతులనపరమైన ఇంట్లో గుగ్గిలం సాంబ్రాణి కలిపి దూపం పెడితే ఇంట్లో ఉన్న నెగటివ్ వైబ్రేషన్ వెళుతుంది. positive వైబ్రేషన్ చక్కగా వస్తుంది. దూపము అంటే పొగ వలన ఇంటిలో ఉన్న దోమలు, ఈగలు, అన్ని బయటికి పోతాయి. చక్కని సుగంధ వాసనకు మంచి నిద్ర కూడా పడుతుంది. ఇంట్లో తేమ ఉంటే వైరస్ వచ్చే ప్రభావము ఉంటుంది. పొగ పెట్టటం వలన తేమ పోతుంది. యజ్ఞం వలన స్వభావిక జీవలయబద్ధత ఆధారంగా ప్రకృతి తన మొత్తం కార్యకలాపాల్ని వ్యవస్థీకృతమై ఒక విధమైన స్వరలయల్లోకి వస్తుంది. అందువలన ప్రతి చికిత్స కేంద్రానికి ధూపం సాంబ్రాణి, మరియు గుగ్గిలం కలిపి వేసే ఒక అగ్నిశాల, లేదా యజ్ఞశాల లేదా ఒక ధూపం వేసే పొయ్యి ఉండాలి. ఈ ధూపం మాత్రం మానవుడి మనసు, మస్తిష్కం, రక్తల్లోకి జీవ రసాయనంపై ఆరోగ్య కరమైన ప్రభావం చూపుతుంది. రోగకార క్రిములను సంహరిస్తుంది.

2. రాత్రి పూట నిదురించే సమయంలో లేదా శ్వాసించే సమయంలో అలసట పోగొట్టటానికి కనురెప్పలు మూసుకొని, అరికాళ్ళ వేళ్ళ నుండి తల వరకు ఒక్కొక్కటిగా ప్రతి భాగాన్ని ఆజ్ఞాలు జారిచేస్తూ శిథిలం చేస్తూ, ఏ కార్యకలాపాలు జరగని ఒక సూన్య స్థితికి తీసుకొని వెళ్ళాలి. అలాంటి స్థితిలో తీసుకొనే విశ్రాంతి సుఖశాంతులు అనుభూతినిస్తుంది. 15 నిముషాల తరువాత ఒక్కొక్క అవయవాన్ని జాగృతం చేస్తూ లేచి 5 నిముషాలు ప్రశాంతంగా కూర్చోవాలి. ఆ తరువాత లేచి మీ పనులు మీరు చేసుకోవచ్చును.

3. కాఫీ, టీ, కి బదులు గోధుమలు, మెంతులు ఒకే ముకుడులో వేసి తక్కువ మంట మీద చాలా సేపటి వరకు వేయించి, దానిని తీసి దంచి పక్కకు పెట్టాలి. టీ కి బదులు తులసి, పుదీన, ఆకుల్ని లేదా లెమన్ గ్రాస్ ని బాగా ఎండపెట్టి ఉంచాలి. టీ కాఫీ తయారుచేసే ముందు మొట్ట మొదట వీటిని నీటిలో మరిగించాలి. తరువాత పాలు బెల్లం, యాలుకలు, లేదా అమృత లేదా శొంఠి, లేదా అల్లం కలిపి చక్కగా తాగవచ్చును. ఇది ఉత్తమ ఆరోగ్యకరమైన పానీయం.

3. దీనిలో అమృత అంటే బెల్లం పాకం అని ఇక్కడ అర్డము.

4. ఫలాలు: దోస, పాలకూర, కొత్తిమీర, తోటకూర, మెంతులు, క్యారెట్, టమాటా, ఖీరా, అనపకాయ, apple వంటి కూరగాయల రసాలు తాగాలి.

5. చట్నీ కొరకు
కొబ్బరి 50 గ్రాములు
వెల్లుల్లి గర్భాలు 5.
కొత్తిమీర 20 గ్రాములు
క్యారెట్,లేదా,ముల్లంగి, లేదా ముల్లంగి ఆకులు 50 గ్రాములు
ఉసిరి 20 గ్రాములు
అల్లం 20 గ్రాములు
అన్ని కలిపి దంచి చట్నీ చేయాలి.

6. మనం నివసించే ప్రాంతంలో చక్కని గాలికి, వాతావరణ కాలుష్యం లేకుండా ఉండటానికి, వేప, కొబ్బరి చెట్టు, కరివేపాకు, జామ, గులాబి, విరజాజి, మల్లెమొగ్గలు, పారిజాతం చెట్లు పెంచాలి. దీని వలన మనకు కావలసిన ఆకులు, పూలు, ఫలాలు దొరుకుతాయి. కలుష్యానివరణ జరుగుతుంది.

7. క్రిమిసంహారక మందులు ఉపయోగించే బదులు వేపాకుల బూడిద, రొట్ట, పేడ నీరు చల్ల వచ్చును. పొలానికి కానీ ఇంటికి కానీ చుట్టూ తులసి చెట్లు పెంచాలి. ఇలాంటివి చేయటం వలన విష ప్రభావం ఉండదు.

8. చివర మాట. ముందుగా మన మెదడులో మంచి ఆలోచన ఉండాలి. అప్పుడే మనం శుభ్రంగా ఉంటాం, తరువాత ఇల్లు శుభ్రంగా ఉంటుంది. దీనిని చూసిన వారందరు మీలాగే శుభ్రంగా వాకిళ్ళు ఉంచుతారు. తరువాత గ్రామం శుభ్రంగా ఉంటుంది. తరువాత మండలం శుభ్రంగా ఉంటుంది. తరువాత జిల్లా, రాష్ట్రం, దేశం, చివరకు ప్రపంచం మొత్తం పరిశుభ్రంగా ఉంటుంది.

-షేక్. బహర్ అలీ.
యోగచార్యుడు

Leave A Reply

Your email address will not be published.