షేక్.బహర్ అలీ: మెంతులతో మధుమేహం మాయం!

మధుమేహం అంటే షుగర్ ఇదొక వ్యాధి, ఈ వ్యాధి సాధారణంగా ఇప్పుడున్న జమానాలో అందరికి వస్తుంది. దీనికి ముఖ్య కారణం విచ్చలవిడిగా తిండి తినటం, రెండివది సరైన సమయానికి తిండి తినకపోవటం, లేక వంశపారంపర్యంగా రావటం ఏదొక విధంగా రావటం జరుగుతుంది. ఇది కొందరికి మాత్రమే పక్కాగా జరుగుతుంది. కనుక వచ్చింది ఎలాగైనా స్వీకరించక తప్పదు.
నివారణకు కొన్ని చిట్కాలు. ముందుగా యోగాసనాలు, కాపాలభతి, అనులోమ విలోమ, మండుకాసనం, శశాంకాసనం, పశ్చిమోత్తాసనం, అర్ధ మత్స్యేంధ్రాసనం చేయాలి.
ఆయుర్వేదంలో మధునాసిని వాటి టాబ్లెట్ వాడాలి. ఆలోవీర జ్యూస్ టీ స్పూన్, ఆమ్లా జ్యూస్ టీ స్పూన్, రెండు టీ స్పూన్ నీరు కలిపి ఉదయం పరిగడుపున, సాయంత్రం కూడా అలానే తీసుకుంటే మధుమేహం తగ్గుముఖం పడుతుంది. ఆహారం ఒకేసారి కాకుండా 3 భాగాలు చేసి తినండి. ఇలాచేస్తే మధుమేహం పెరగదు.
మెంతులతో షుగర్‌కు చెక్…
షుగర్ వ్యాధిలో మెంతి గింజల ఉపయోగాలు గురించి కొద్దిగా తెలుసుకుందాం. భోజనంలో పీచుపదార్దాలు తీసుకోవాలి. మధుమేహాన్ని నివారించే గుణం మెంతులు ఉంది. రోజుకు 3 టీ స్పూన్ మెంతులు 3 వారాలు తీసుకొని మరల మధుమేహం పరీక్షలు చేయించండి. రక్తంలో, మూత్రంలో గ్లూకోజ్ శాతం తగ్గుతుంది. రోగి చాలా వరకు ఆరోగ్యవంతునిగా ఉంటాడు.
- 1. మెంతి గింజలు మాత్రమే రోగానికి పనిచేస్తుంది.
- 2. మెంతులు చపాతిలో, కూరలో, పప్పులో, చట్నీలో, ఇలా కూడా మనం ఆహారంగా తీసుకోవచ్చును.
- 3. మెంతులు శుభ్రంగా కడిగి నీడ కు ఎండపెట్టి మిక్సీలో వేసి పొడి చేసుకోండి. దానిని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచండి.
- 4. రాత్రి నిదురించేముందు, ఒక గాజు గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ మెంతి పొడి వేసి నానా పెట్టండి. ఉదయం ఆ గ్లాస్ నీరు మరిగించి అర గ్లాస్ వరకు చేసి కొద్దిగా చల్లార్చి నిదానంగా పరిగడుపున తాగండి. ఒక గంట వరకు ఎటువంటి ఆహారపదార్దాలు తీసుకోవద్దు.
- 5. గంట తరువాత టిఫిన్ చేసుకోవచ్చును.
- 6. రోగి స్థితిని బట్టి షుగర్ లెవెల్స్ ని బట్టి మెంతులు పొడి వాడాలి. ఇష్టం వచ్చినట్లు వాడరాదు.
- 7. మెంతి కూరతో షుగర్ తగ్గదు. కానీ ఆకుకూరగా చక్కగా వాడుకోవచ్చును.
- 8. మధుమేహరోగులు, ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయాలి.
- 9. యోగాసనాలు. 1.కాపాలభతి, 2.భస్త్రీక, 3.అనులోమ, విలోమము, చేయాలి.
- 10. మధుమేహ రోగులు పథ్యం చేయాలి. అప్పుడే శతాయువుగా వర్ధిల్లుతారు. మధుమేహం వచ్చిందని భయవద్దు.
హెచ్చరిక: మెంతుల పొడి ఎక్కువగా వాడితే గ్యాస్ వస్తుంది. అలా వచ్చినపుడు తల నొప్పి వచ్చి బీపీ పెరుగుతుంది. కనుక వారానికి ఒకసారి మలబద్దకం కొరకు త్రిఫల చూర్ణం వాడండి. అంత సవ్యంగా జరుగుతుంది.
–షేక్.బహర్ అలీ
యోగచార్యుడు