షేక్.బహర్ అలీ: రసాహారంతో మలబద్దకం మాయం!

ప్రాచీన కాలంలో రసాహారం గొప్ప చికిత్సగా భావించేవారు. ఇది తిరుగులేని చికిత్స. ఈ విధానంతో సాధ్యమైనంత వరకు రోగాలు తగ్గించుకోవచ్చును. చాలా తేలికగా ఉంటుంది. జబ్బులు త్వరగా తగ్గుతాయి. వ్యాధినిరోధక శక్తి చక్కగా పెరుగుతుంది. ఏ జబ్బు అయినా సరే లోపల దాగి ఉన్న గబ్బుతో వస్తుంది. అలా గబ్బుగా ఉన్న జబ్బులలో ఒకటి మలబద్దకం.. ఇది మామూలు జబ్బు కాదు.. దీనితో పలు రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కనుక మలబద్దకం నివారణకు ఈ కూరలు, పండ్లు, ఎక్కువగా తీసుకోవాలి. ఉసిరి, సొరకాయ, జామకాయ, క్యారెట్, టమాటా, దోసకాయతో పాటు అంజీరా, మునగ, కిస్మిస్, బొప్పాయి, నారింజ, కమల పండు, ఖర్భూజ, తర్భుజా, అలుగడ్డలు, గోధుమ గడ్డి, మారేడు, నేరేడు, త్రిఫల, కరక్కాయ, పాలకూర, మెంతికూర, పీచుపదార్దాలు ఎక్కువగా తీసుకుంటే మలబద్దకం పోతుంది. అన్ని పండ్ల రసాలు, ద్రాక్ష, బత్తాయి, బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగాలి. ఇవి తీసుకోవడం వల్ల మలబద్దకం తగ్గిపోతుంది.
–షేక్.బహర్ అలీ
యోగచార్యుడు