షేక్. బహర్ అలీ: శారీరక శక్తికి యోగా..
జ్వరం కానీ, జలుబు,కానీ, కోన్ని రోజులు వేధించి మనిషిని చాలా బలహీనంగా, నీరసం చేసి, శరీరంలో సత్తు లేకుండా చేస్తుంది. దాని వలన మనకు ఏ పని అయిన సరే సరిగ్గా చేసుకోలేము, సరిగ్గా ఆహారం తిన బుద్ధి కాదు. తినటానికి ప్రయత్నం చేసేసిన ఆహారం రుచిగా అనిపించక తినలేము. ఇలాంటి సమయంలో కొన్ని ఆహార నియమాలు పాటిస్తే చాలు.

రాత్రి నిదురించే ముందు రాగి చెంబులో నీటిని వేసి దానిలో 3 తులసి ఆకులు వేసి,ఈ నీటితో ఉన్న చెంబుని ఒక పీట మీద పెట్టి ఉంచవలెను.
తెల్లవారుజామున లేవగానే కాలకృత్యములు చేసుకొని,రాగి చెంబులో నీరు కింద కానీ కుర్చీ మీద కాని కూర్చోని తాగాలి.నిలబడి తాగితే మోకాళ్ళ నొప్పులు వస్తాయి.
తరువాత చక్కగా గాలి,వెలుతురు వచ్చే ప్రదేశంలో అంటే మరి చల్ల గాలి వచ్చే ప్రదేశంలో కూర్చోవద్దు.ఎవరైనా కరోన వైరస్ వచ్చి తగ్గిన వారు మాత్రం ఎవరు లేని రూమ్ లో వెంటి లెటర్స్ ఉన్న ప్రాంతంలో చిన్న దుప్పటి వేసుకొని యోగ , ప్రాణాయామం 45 నిమిషాలు చేయాలి.
యోగాసనాలు
- సూర్యనమాస్కారం.3 సార్లు చేయాలి.
- తాడాసనం
- అర్ధకటి చక్రాసమం.
- పాదహస్థాసనం
- అర్ధచంద్రసనం
- వజ్రాసనం
- వక్రాసనం
- అర్ధమత్స్యేంద్రాసనం
- శశాంకసనం
- సప్తవజ్రాసనం
- అర్ధ ఊష్ట్రాసనం
- ఉత్తనపాదాసనం.
- నౌకాసనం
- మర్కటాసనము
- హలాసన
- చక్రాసనం

- భుజంగాసనం1
- భుజంగాసనం 2
- శాలభసనం 1
- శాలభసనం 3
- మకరాసనం
- ధనురాసనం
- సర్వాంగాసనం
- మత్స్యాసనం
- శవాసనం
చిన్న గమనిక: హలాసనం తరువాత సర్వాంగసనం వేసుకొని తరువాత మత్స్యాసనం వేసుకుని శవాసనం కూడా వేసుకోవచ్చును. మీ వీలుని బట్టి చేసుకోండి. ఇవి అన్ని అసననములు చేయాలని నియమం లేదు,ఓపికను బట్టి వచ్చిన అసనములు చేయండి.మిగతావి వదిలి వేయవచ్చును.
ప్రాణాయమంలో
- భస్త్రిక.
- కపాలభాతి
- అనులోమ విలోమము
- ఉజ్జయిని
- ధ్యాన ముద్ర చేయాలి.
- సింహాసనం
- హాస్యాసనం చేయాలి.

యోగ చేసిన తరువాత….
- యోగ చేసిన తరువాత 30 నిమిషాలు ఆగి టిఫిన్ చేయాలి.
- ఒకవేళ తాగితే వేడి నీటిలో ఒక టీ స్పూన్ నిమ్మరసం,తేనే సమానంగా కలిపి తాగాలి.
- తరువాత అల్పాహారం 9 గంటలకు తినాలి.
- ఒక వేళ కరోన వైరస్ వచ్చి వెళ్లిన వారు ఉంటే డాక్టర్ చెప్పిన మందులు వేసుకోవాలి.
- మధ్యాహ్నం 1-2 గంటల మధ్యలో రెండు పుల్కాలు, ఒక కప్పు అన్నం తినాలి.జలుబు లేకపోతే ఒక కప్పు మజ్జిగ తాగాలి.
- సాయంత్రం 5 గంటలకు ఏదైనా ఫ్రూట్ సలాడ్స్ లేదా జ్యూస్ తాగాలి.
- రాత్రి 8 గంటలకు ఆహారం రెండు చపాతిలు తినాలి.వేడి పాలలో 3 మిరియాలు దంచి కలిపి తాగాలి.
- నిదురించే ముందు జలుబు ఉంటే యూకలిప్ట్స్ ఆయిల్ వేడి నీటిలో వేసి ఆవిరి పట్టాలి.
- ఊపిరితిత్తుల వ్యాధులు ఉంటే,ఆస్తమా,సైనస్, టీబీ, కరోన వైరస్ వచ్చి వెళ్లిన వారు ,చావన్ ప్రాష్ లేహ్యం,ఉదయం పరిగడుపున ఒక టీ స్పూన్ తీసుకొని అర గంట ఆగి వేడివేడి పాలు తాగిన తరువాత కొద్దిగా విరామం ఇచ్చి టిఫిన్ చేయాలి.
జ్వరం వచ్చి ఉంటే యోగ చేయరాదు.
జ్వరం వచ్చి వెళ్లి నీరసంగా ఉంటే బార్లీ జావా తాగండి.మంచి బలంగా ఉంటుంది.
స్పెషల్ treatnent కరోన వైరస్ వచ్చిపోయిన తరువాత వారు ఊపిరితిత్తులను చాలా చక్కగా పనిచేయడానికి ఒక బెలూను (బూర) నోటి ద్వారా ఊదాలి.ఇది ప్రతి రోజు తప్పకుండా చేయాలి.
-షేక్. బహర్ అలీ.
యోగచార్యుడు