షేక్.బహర్ అలీ : శ్వాసకోస వ్యాధినిరోధక చిట్కాలు..
జలుబు, సైనస్, ఆస్తమా, టిబి,దగ్గు , తుమ్ములు రావటం ,దుమ్ము ధూళి వాతావరణ కాలుష్యం వలన వచ్చే వ్యాధులు,కాస్మొటిక్స్ వలన , చెట్ల వలన,గ్యాస్ వలన,కాన్సర్,వలన ఇతర వైరస్ ప్రభావంతో వచ్చే ఊపిరితిత్తులు వ్యాధులు తగ్గటానికి,మరియు అకస్మాత్తుగా ఊపిరి అడకపోవటం వాటిని ఈ క్రింద చిట్కాలతో వెంటనే ఉపశమనం పొందవచ్చును .
ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు 1 లీటరు వేడి నీటిలో చిటికెడు ఉప్పు వేసి నీటిని నోటిలో వేసుకొని garglig చేయవలెను.బీపీ ఉంటే ఉప్పు వేయరాడు నిమ్మరసం ఒక టీ స్పూన్ వేసి gargling చేయాలి.
లేదా నువ్వులనూనెతో లేదా sunflower పొద్దుతిరుగుడు నూనెతో కానీ 15 నిమిషాలు నోటిలో వేసుకొని గర్గ్లింగ్ చేయాలి.
ఈ క్రింది విధంగా ఆయుర్వేద టీ తయారుచేసుకొని తాగాలి.
- ఒక పెద్ద గ్లాస్ నీటిలో
- 5 తులసి ఆకులు
- టీ స్పూన్ అతిమధురం
- 1/4 టీ స్పూన్ పిప్పళ్ళ చూర్ణం
పటికి బెల్లం తగినంత వేసి అన్ని కలిపి బాగా మరిగించి అర గ్లాస్ వరకు మరిగించి వేడి వేడి గా తాగాలి.దీనిలో తేనె వేయవద్దు.ఊపిరితిత్తులలో ఉన్న బెల్లామ్ పోయి శ్వాస చక్కగా నడుస్తుంది,.
ముక్కులు జలుబుతో సరిగా శ్వాస నడవకపోతే అణు తైలం చెరో ముక్కులో 2 చుక్కలు వేస్తే చమత్కారంగా ముక్కులు చక్కగా పనిచేస్తాయి.
దయచేసి ముక్కులలో నెయ్యి వేయవద్దు.ఒక వేళ వేస్తే నేయి వేడి చేసి నీరులాగా మారిన తరువాత వేయండి.చలి కాలంలో నెయ్యి గడ్డ కట్టి ఉంటుంది కనుక వద్దు అని చెప్పినాను.
వేడి నీటిలో యూకలిప్ట్స్ 2 చుక్కలు ఆయిల్ వేసి ఉదయం మరియు సాయంత్రం ఆవిరి పట్టండి.దయచేసి పసుపు ఒక్కసారి మాత్రమే వాడండి.ఎక్కువగా పసుపు వాడితే ఊపిరితిత్తుల లో బెల్లామ్ ఎండిపోయి పొడి దగ్గు వస్తుంది.అవసరమైతే జిందాతిలిష్మత్ 2 చుక్కలు కూడా వేడి నీటిలో వేసి ఆవిరి పట్టవచ్చును.ఆదికూడా అతిగా చేస్తే పొడి దగ్గు వస్తుంది.
ఆయుర్వేద మందులు chavanprash , శ్వాసహరి క్వాథ్, చిత్రకి హరితకి అవలేహ్యం,కాసహర శ్వాసామృత్, మహా లక్ష్మీ విలాస్ రస,చాలా మందులు ఉన్నాయి. డాక్టర్ సలహా మేరకు వాడండి ..
యోగాసనాలు
- సూర్యనమస్కారములు 5 సార్లు
- కపాలభాతి 300 సార్లు
- అనులోమ విలోమమ 30 సార్లు
- ఉజ్జయిని 9 సార్లు
- శీతలీ 5 సార్లు
- జ్ఞాన ముద్ర 10 నిముషాలు చేసి శవాసనం చేయాలి.
జ్వరం ఉంటే యోగ చేయరాదు.
-షేక్.బహర్ అలీ
ఆయుర్వేద వైద్యుడు. యోగచార్యుడు