సంగారెడ్డి: తుల్జాభవాని ఆలయంలో హుండీ చోరీ!

మునిప‌ల్లి: సంగారెడ్డి జిల్లాలోని మునిపల్లి మండలం బుధేరా చౌరస్తాలోని తుల్జాభవాని ఆలయంలో బుధవారం దుండగులు చోరీకి పాల్పడ్డారు. స్థానికుల కథనం మేరకు.. తుల్జాభవాని ఆలయంలో గుర్తు తెలియని దుండగులు చొరబడి ఆలయంలోని ప్రధాన హుండీని దొంగలించినట్లు వారు తెలిపారు. ఏడాది క్రితం ఓ సారి ఇదే ఆలయంలో హుండీ ఆలయ సామగ్రి దొంగతనం జరిగినట్లు గుర్తు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.